News

CAAతో ఏ ఇబ్బందీ లేదు – బాలీవుడ్

1kviews

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అవగాహన కల్పించేందుకు భాజపా మరో ముందడుగు వేసింది. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులతో సీఏఏకు మద్దతుగా వీడియో చిత్రీకరణ చేసి బుధవారం మధ్యాహ్నం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది. దిల్లీలోని జేఎన్‌యూలో దాడి ఘటనపై ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన మరుసటి రోజే భాజపా ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం. భాజపా తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియోను విడుదల చేసింది. బాలీవుడ్‌ ప్రముఖులు సింగర్‌ షాన్‌, నటులు తనీషా ముకర్జీ, రణ్‌వీర్‌ షోరే, దర్శకుడు అనిల్‌ శర్మలతో ఈ వీడియోను చిత్రీకరించారు. అందులో వారంతా సీఏఏకు మద్దతుగా మాట్లాడారు. ఈ చట్టం ఏవిధంగానూ భారతీయ పౌరులపై ప్రభావం చూపించదని వారు పేర్కొంటారు. భారత చుట్టుపక్క దేశాల్లో ఉండే మైనారిటీలు అక్కడ హింసను ఎదుర్కొని ఇక్కడికి వచ్చిన వారికి మాత్రమే ఈ చట్టం పౌరసత్వం కల్పిస్తుందని రణవీర్‌ షోరే చెప్తారు. భాజపా ఈ వీడియో పోస్ట్‌ చేసిన వెంటనే 30వేల మందికిపైగా వీక్షించారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.