
269views
న్యమత కార్యక్రమాలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. తబ్లిక్ జామాద్ ఆధ్వర్యంలో ఈనెల 13, 14 తేదీల్లో తిరుపతిలో తబ్లిక్ ఇస్తామా కార్యక్రమం ఏర్పాటు చేశారని, పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారని వివరించారు.
తబ్లిక్ జామాద్ సంస్థను సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధించందని, ఇక్కడ ఎలా అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తబ్లిక్ ఇస్తామా కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంస్థల కార్యక్రమాలు దేశంలో జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిషాను ఆయన కోరారు.





