News

జీఎస్టీ సంస్కరణలను స్వాగతించిన భారతీయ మజ్దూర్ సంఘ్

141views

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత నిత్యవసరాలతో పాటు కీలక వస్తులపై జీఎస్టీని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ్ GST సంస్కరణల స్పందిస్తూ.. “ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన కొత్త GST సంస్కరణలు పన్ను నిర్మాణం వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తాయని అభిప్రాయపడింది. సాంప్రదాయకంగా, పరోక్ష పన్ను విధానం పౌరుల రోజువారీ అవసరాలపై పన్ను విధించడంతో ఎక్కువ ప్రభావం ఉండేది. తాజాగా దేశ ప్రజలకు అవసరమైన రోజువారీ వినియోగ వస్తువులు, బీమా పాలసీలు, విద్యా సామగ్రి, వ్యవసాయ యంత్రాలు, ఇతర ఇన్‌పుట్‌లు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మధ్యతరగతి ప్రజలు సాధారణంగా ఉపయోగించే ఇతర వస్తువులపై పన్ను తగ్గింపును తాము స్వాగతిస్తున్నాము” అని భారతీయ మజ్దూర్ సంఘ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.