News

మనమంతా హిందువులమే : శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వామి

220views

సనాతన ధర్మం చాలా గొప్పదని కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. సనాతన ధర్మం గొప్పదని, దీనినే హిందూ ధర్మం అని కూడా అంటామన్నారు. తిరుపతిలో చాతుర్మాస్య దీక్షలో వున్న శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారిని రాష్ట్రానికి చెందిన 400 మంది ఎస్సీ మహిళలు, పురుషులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కుటుంబాల సమ్మేళనాన్ని ఉద్దేశించి స్వామి వారు ఆశీ: పూర్వక ప్రసంగం చేశారు.

హిందూ ధర్మం చాలా గొప్పదని, ప్రతి రోజూ అందరూ తమ తమ ఇష్ట దైవాన్ని స్మరించుకోవాలని సూచించారు. అలాగే నుదుటిన తిలకము ధరించాలని, ఇళ్ల ముందు ముగ్గులు కూడా వేసుకోవాలని సూచించారు.

స్వామి వారి ఆశీ: పూర్వక ప్రసంగం ముగిసిన తర్వాత వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టమని అన్నారు.

ఈ ఎస్సీ సమ్మేళనంలోశ్యామ్ ప్రసాద్ (జాతీయ కన్వీనర్,సామాజిక సమరసత) వెంకటేశ్ (,సుబ్బయ్య ( రాష్ట్ర అధ్యక్షులు,ఎస్సీ,ఎస్టీ,హక్కుల సంక్షేమ వేదిక) కడప జిల్లా నుండి ఎస్సీ ఎస్టీ హక్కుల జిల్లా అధ్యక్షులు శ్రీ మోడపోతుల సత్యనారాయణ గాంధీ,శ్రీ జగన్మాత మారెమ్మ దేవాలయం ధర్మకర్త పుష్పగిరి తీర్థ క్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు,న్యాయవాది సట్టి భారవి,తిరుపతి నుండి పెనుబాల చంద్రశేఖర్, మునిసుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.భక్తులకు ఆది శంకరుల చిత్రపటము, మహిళలకు కుంకుమ,చీర అంద చేశారు,