News

ఏ సంస్థ మీదా సంఘ్ తన నిర్ణయాన్ని రుద్దదు : మోహన్ భాగవత్

186views

సంఘ, బీజేపీ మధ్య వుండే సంబంధాలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ మరోసారి స్పష్టతనిచ్చారు. ఆరెస్సెస్, దాని నుంచి ప్రేరణ పొందే సంస్థల మధ్య అభిప్రాయ భేదాలు వుండొచ్చు కానీ… మానసిక అంతరాలు మాత్రం వుండవని స్పష్టం చేశారు.

సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మూడు రోజుల పాటు ‘‘వ్యాఖ్యాన మాల’’ జరిగింది. ఇందులో చివరి రోజైన మూడో రోజు శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

సంఘ్ ఏ సంస్థ మీదా తన నిర్ణయాన్ని రుద్దదని, వాటి పనితీరులో, ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకోదని పునరుద్ఘాటించారు. అన్ని సంస్థలు కూడా సర్వ స్వతంత్రమైనవని, స్వావలంబనతో పనిచేస్తున్నాయని అన్నారు. వాటి స్థాయిలో అవి సొంత నిర్ణయాలే తీసుకుంటాయన్నారు. అయితే.. అభిప్రాయ భేదాలు వుండొచ్చు కానీ.. మానసిక అంతరాలు మాత్రం వుండవన్నారు.

వివిధ సంస్థల్లో ప్రతిదీ సంఘమే నిర్ణయిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానంగా…

ఈ ఆలోచన పూర్తిగా తప్పు. చాలా సంవత్సరాలుగా నేను శాఖ నడుపుతున్నా. ప్రభుత్వాన్ని వారు (బీజేపీ) నడుపుతున్నారు. మేము సలహాలు మాత్రమే ఇ్వగలం. కానీ..నిర్ణయాలేవీ తీసుకోం. ఒకవేళ సంఘమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. దానికి ఎందుకు ఇంత సమయం పట్టేది?’’ అని మోహన్ భాగవత్ అన్నారు.