News

సంభాల్ అల్లర్ల వల్లే హిందూ జనాభా తగ్గిపోయింది : కీలక రిపోర్టు సమర్పించిన కమిటీ

377views

హిందువులే కేంద్రంగా సంభాల్ లో జరిగిన అల్లర్లపై ఏర్పాటైన జ్యుడీషియల్ దర్యాప్తు కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ కి సమర్పించింది. మొత్తం 450 పేజీల సుదీర్ఘ నివేదికను కమిటీ రూపొందించింది. ఇందులో పలు కీలక విషయాల్ని కమిటీ పొందు పరిచింది. మతపరమైన అల్లర్ల కారణంగా సంభాల్ లో హిందూ జనాభా తీవ్రంగా తగ్గిపోయిందని స్పష్టంగా నివేదించింది.

1947 సంవత్సరంలో సంభాల్ లో హిందువుల జనాభా 45 శాతంగా వుండగా… ఇప్పుడు 15 నుంచి 20 శాతం మాత్రమే వుందని పొందుపరిచింది.

చరిత్ర పరంగా చూసుకుంటే సంభాల్ పఠాన్లు, టర్కుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతుండేది. దీంతో మతపరమైన ఘర్షణలకు కేంద్రంగా మారింది. 1947 నుంచి జరుగుతున్న అల్లర్లలో ప్రధానమైన బాధితులు హిందువులే. హిందువులే కేంద్రంగా అల్లరి మూకలు రెచ్చిపోయేవారు. తాజాగా సంభాల్ లో జరిగిన అల్లర్లు కూడా హిందువులను కేంద్రంగా చేసుకొని జరిగినవే. అని రిపోర్టులో పేర్కొన్నారు.

అంతేకాకుండా అల్లర్ల తీవ్రతను పెంచడానికి బయటి నుంచి కూడా వ్యక్తులను రప్పించినట్లు నివేదికలో స్పష్టంగా పొందుపరిచారు. హరిహర్ ఆలయం చుట్టూ కొత్త వివాదం తలెత్తిందని, ఇది మళ్లీ మొఘల్ చక్రవర్తి బాబర్ కాలం నాటి వాదనలతో ముడిపడి ఉందని, పాత ఉద్రిక్తతలను తిరిగి పుంజుకుంటుందని పేర్కొంది.

స్వాతంత్య్రం వచ్చిన సమయంలో సంభాల్ మునిసిపల్ జనాభాలో దాదాపు సగం మంది హిందువులేనని, నేడు సంభాల్‌లో కేవలం 15% మంది హిందువులు మాత్రమే మిగిలి ఉన్నారని వర్గాలు చెబుతున్నాయి. ఇది 45% కంటే గణనీయంగా తగ్గిందని కూడా కమిటీ పేర్కొంది.

ఇటీవలి సంవత్సరాలలో, సంభాల్ వివిధ ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా కూడా ఉద్భవించింది. అల్-ఖైదా మరియు హర్కత్-ఉల్-ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు ఈ ప్రాంతంలో నెట్‌వర్క్‌లను స్థాపించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

సంభాల్ నేపథ్యమిదీ…
1976 నుంచే సంభాల్ లో హిందువులే కేంద్రంగా అల్లర్లు జరుగుతున్నాయి. అలాగే హిందువుల దేవాలయాల ఆక్రమణ కూడా జరుగుతోంది. ఓ పకడ్బందీ ప్రణాళికలతోనే హిందువులను సంభాల్ నుంచి తరిమికొట్టారు.

సంభాల్ అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం. చాలా హిందూ ఆలయాలకు కేంద్రమిది. పురాణాల్లో కూడా సంభాల్ ప్రస్తావన స్పష్టంగా కనిపిస్తుంది. అయోధ్య, మధుర, కాశీకి ఎంత ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత వుందో.. ఈ ప్రాంతానికి కూడా అంతే ప్రాధాన్యత వుంది. కానీ.. ఈ ప్రాధాన్యతను తగ్గించి, తమ మత ప్రాబల్యం పెంచుకోవడానికి కొందరు హిందువులను టార్గెట్ చేస్తూ, అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు.

2024 నవంబర్ ప్రాంతంలో అల్లర్లు
సంభాల్ లోని షాహీ జామా మసీదు వున్న ప్రాంతంలోనే దేవాలయం వుందని హిందూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు.దీనిపై కోర్టు విచారించింది. సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సర్వే చేస్తున్న సమయంలోనే స్థానికులు, పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పంటించారు.

మరోవైపు సంభాల్ లో విద్యుత్ చౌర్యం, అక్రమంగా స్మార్ట్ మీటర్లు అమర్చుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వీటిపై విచారణ జరిపేందుకు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలోనూ గొడవలు జరిగాయి.

సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్‌కు విద్యుత్ శాఖ భారీ షాకిచ్చింది. కరెంటు చోరీకి పాల్పడిన కేసులో రూ.1.91 లక్షల జరిమానా విధించింది. ఆయన ఇంటికి విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసింది. ఈ విషయాన్ని అధికారులు శుక్రవారం వెల్లడించారు. అంతేకాకుండా ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. 1.91 లక్షల రూపాయల జరిమానాను వెంటనే కట్టేయాలని కూడా నోటీసులు జారీ అయ్యాయి.పాత రెండు మీటర్లను తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లను అమర్చారు. ఆ తర్వాత రెండు పాత మీటర్లను సీల్ చేసి పరీక్షల నిమిత్తం పంపించారు. అయితే విద్యుత్ చౌర్యం జరిగిందని మాత్రం అధికారులు ధ్రువీకరించారు.మరో వైపు ఈ దాడిలో ఈ దాడిలో 50కి పైగా ఎల్‌ఈడీ బల్బులు, మూడు స్ప్లిట్ ఏసీలు, రెండు రిఫ్రిజిరేటర్లు, కాఫీ మేకర్, గీజర్, మైక్రోవేవ్ ఓవెన్ వంటి భారీ ఎలక్ట్రికల్ పరికరాల వినియోగంతో సహా అక్రమాలన్నీ వెలుగు చూశాయి.ఆయన ఇంట్లో 16 కిలోవాట్లకు పైగా విద్యుత్తు వినియోగిస్తున్నారని తేల్చారు.