News

కొత్తమ్మ తల్లి జాతరను నిర్వ‌హణకు ఏర్పాట్లు

186views

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్ర‌తిష్ట్మాకంగా నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు దేవాదాయశాఖ అధికారుల‌ను ఆదేశించారు.

వ‌చ్చే నెల 23 నుంచి 25 వ‌ర‌కు జ‌రుగనున్న పండ‌గ మహోత్సవం నేప‌థ్యంలో కొత్త‌మ్మ‌త‌ల్లి జాత‌ర ఏర్పాట్ల‌పై ఆయన స‌మీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రముఖ ఆలయాల తరహాలో క్యూలైన్లు అవసరం, ఉచిత దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ప్రతి వంద మీటర్లకు తాగునీరు, పాలు వంటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తపేట నుంచి విద్యుత్తు అలంకరణ చేయాలని సూచించారు. క్రీడా పోటీలు, వివిధ సాంస్కృతిక, శోభాయాత్ర‌, వంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని తెలిపారు. కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో పీఎసీఎస్ మాజీ అధ్య‌క్షులు కింజరాపు హరివర ప్రసాద్, రైస్ మిల్లర్లు సంఘం అధ్యక్షుడు బోయిన రమేష్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.