News

తప్పుడు పత్రాలతో మదర్సా భూమి : హిందువుల ఆందోళన

117views

చట్టవిరుద్ధంగా పనిచేసేస్తున్న మదర్సాలపై గత మార్చిలో ప్రధాన చర్యలు తీసుకుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి సూచనల మేరకు అధికారులు అక్కడ నియమాలను ఉల్లంఘించిన, సరైన పత్రాలు లేని మదరసాలకు సీల్ వేశారు. అప్పుడు కోర్టు అన్నీ సరైన పత్రాలను చూపించిన పక్షంలో తిరిగి మదర్సాలను తెరవవచ్చనే నిబంధనలకు లోబడి ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఈ నిబంధనలకు లోబడి కొన్ని మదర్సాలు తిరిగి తెరవబడ్డాయి. వీటిల్లో ఖుషాల్‌పూర్‌లో ఉన్న జామియా హస్నైన్ బిన్ అలీ మదర్సా కూడా ఉంది. కానీ ఇప్పుడు ఈ మదర్సా గురించి మళ్ళీ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మదర్సాను తిరిగి తెరిపించడం కోసం తప్పుడు పత్రాలు తయారు చేసి కోర్టులో ప్రవేశపెట్టారనీ, కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని స్థానిక హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఈ స్థలం మదరసాదే అని కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి 2023 లోనే మరణించారని హిందూ సంస్థలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, మరణించిన వ్యక్తి పేరు మీద పత్రాలను సమర్పించడం చట్టబద్ధంగా సరైనదేనా కాదా అనే ప్రశ్న తలెత్తుతుంది. వివరాల్లోకి వెళితే గ్రామ సొసైటీ భూమిలో మదర్సా నిర్వహిస్తున్నారు, కానీ ఖస్రా నంబర్ , భూమి వివరాలు పత్రాలలో భిన్నంగా చూపించబడ్డాయి. కాబట్టి ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేసి, నిబంధనలను నిర్ధారించాలని స్థానిక హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ఆ మదర్సా కనుక నిబంధనలను ఉల్లంఘించినట్లయితే, భవిష్యత్తులో ఇటువంటి కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు అంటున్నారు.