
‘హిందూ ఆమీర్ ఆఫ్ ముస్లిమ్స్: ఇండీజినైజ్డ్ ఇస్లాం ఫ్రం ది ఇండియన్ ఓషన్ లిటోరల్ మలబార్’ ఇది చరిత్రకారుడు అబ్బాస్ పన్నకల్ రాసిన పుస్తకం, ఉగ్రవాద ముస్లిం సంస్థలు, పాశ్చాత్య దేశాలు వర్ణిస్తున్నట్టు జిహాద్ అంటే అసలు అర్ధం అది కాదని ఈ పుస్తకం చెప్పే ప్రయత్నం చేసింది. ఇస్లాం ఆధిపత్యాన్ని రుద్దడానికి జరిపే హింసాత్మక దాడే జిహాద్ అంటే అని ఉగ్రవాద సంస్థలు, పాశ్చాత్య దేశాలు చెబుతాయని, కానీ దాని ఉద్దేశం కానేకాదని అంటాడు అబ్బాస్, కానీ జిహాద్ కేరళలో పుట్టిందని, ముస్లింలు, ముస్లిమేతరులు కలసి ఒక హిందూ పాలకుడిని రక్షించే ప్రయత్నం దీని ద్వారా జరిగిందని ఆయన చెబుతున్నారు. ఒక హిందువును ఆమీర్ అని గౌరవించడం ఇస్లాం ప్రకారం విరుద్ధమని, షేక్ జైనుద్దీన్ మఖ్తూమ్, ఖాజీ మహమ్మద్ వంటి ముస్లిం మత పండితులు. గ్రంథాలు ఇదే చెబుతున్నాయని అన్నారు అబ్బాస్.
అలాగే ఇస్లాం గురించి కొన్ని ముస్లిం సంస్థలు ఏం చెబుతున్నాయో కూడా ఆయన చెప్పారు. ఇస్లాం పట్ల నిజమైన అనురక్తి ఉంటే ఇస్లామిక్ పాలన తేవడానికి కనీసం మానసికమైన సంసిద్ధతనైనా ఉండాలి, లేదంటే అతడు లేదా ఆమె ఇస్లాం విశ్వాసం అసంపూర్ణమని ఆ సంస్థలు చెబుతాయట. కేరళలో 16వ శతాబ్దం నాటి ముస్లిం పండితులు పోర్చుగీసు వ్యతిరేకంగా జిహాద్ ప్రకటించారని, జామరిన్ పాలకులతో ఆ పరాయి వారు జరిగిందని అబ్బాస్ పేర్కొన్నారు. ఇప్పుడు జిహాద్ అంటే వర్గాల మధ్య హింసను ప్రేరేపించేదిగా వ్యాఖ్యానిస్తున్నా, ఆనాడు జిహాద్ను రెండు వర్గాల మధ్య సుహృద్భావానికి ఉద్దేశించారని అబ్బాస్ చెబుతున్నారు. చాలియం కోట సంఘర్షణ గురించి కవి ఖాజీ మహమ్మద్ రాసిన కవిత ఆ విషయం స్పష్టం చేస్తున్నదని అంటారాయన. చాలియం కోట పోర్చుగీస్ నిర్మించినది. కానీ అక్కడి రాజులు జామెరిన్లు. వీరు ఆ కోట మీద దాడి చేసినప్పుడు జామెరిన్ కోసమే (హిందూరాజులు, జామెరిన్ అనేది వారి బిరుదు) కోసం త్యాగం చేయాలని ముస్లింలు ప్రతిన పూనారట. కానీ హిందువులు మాత్రం, ముస్లింలు తమ వర్గం వారు చనిపోవడానికి అవకాశం ఇవ్వరాదని, అందుకు కారణం వారు మైనారిటీ కావడమేనని భావించారట. దీనితో ముస్లింలు, హిందువులు కలసి రాజు కోసం పోరాడాలని ఏకమయ్యారట. అందుకోసం శాంతియుత సహజీవనం కూడా చేయాలని నిర్ణయించుకున్నారట.
ఖాజీ మహమ్మద్ కవిత ఫతుల్ ముబిన్ ఈ ఘట్టం వర్ణించాడు. ఈ కవిత రాసిన ఖాజీ హిందూ రాజు క్షేమం కోసం ప్రార్థించి, మిగిలిన ముస్లింలు కూడా ప్రార్థించాలని ఆదేశించాడట. అదే సమయంలో పోర్చుగీస్తో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా వారి అకృత్యాలను సమర్ధించిన భారత్లోని ఇతర ముస్లిం పాలకులను ఖాజీ విమర్శించాడట. ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం జిహాద్ అనేది కేరళలో స్థానిక హిందూ రాజుకు మద్దతుగా వచ్చింది. అంతేగాని ముస్లిం పాలకుడు లేదా ముస్లింగా మారిన హిందూ పాలకుని రక్షణ కోసం కాదని కూడా అబ్బాస్ వ్యాఖ్యానించాడు. జామెరిన్ రాజ్యంలో జిహాద్ అనేది రెండు మతాల మధ్య సుహృద్భావ వాతావరణానికి ఒక పనిముట్టుగా ఉపయోగపడిందంటాడు అబ్బాస్. పోర్చుగీస్పై యుద్ధంలో తమకు సహకరించవలసిందిగా జామెరిన్ తల్లి కుంజలి మరక్కర్, ఉమర్ అంతాబ్ది, అబ్దుల్ అజీజ్ వంటి ముస్లిం పాలకులకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనితో వీరు ఆ విషయం గురించి చర్చించడానికి కొజికోడ్ దగ్గరలోని ఒక మసీదులో సమావేశ మయ్యారని ఈ పుస్తకం వెల్లడించింది. తుఫత్ అల్ ముజాహిదీన్ అనే పుస్తకం జైనుద్దీన్ మఖ్తూమ్ మరొక విషయం ప్రస్తావించారట. జామెరి రాజులు ముస్లింలను ఏ విధంగా అక్కునచేర్చుకున్నదీ ఈ రచన వెల్లడిస్తున్నది.
ఆ రాజులు ముస్లిం కోసం ప్రత్యేక శ్మశాన వాటికలు ఇచ్చారు. మసీదులు నిర్మించుకోవడానికి, ముస్లిం మత సంస్థలు స్థాపించుకోవడానికి ఇతర ముస్లిమేతర పాలకులు కూడా ముందుకు వచ్చారట. ఆఖరికి ముస్లిం న్యాయమూర్తుల (కాజీలు)కు జీతాలు కూడా వారే ఇచ్చేవారట. ఇంతకీ అబ్బాస్ గారు ఏం చెప్పబోతున్నారు. జిహాద్ అనేది రెండువర్గాలను కలిపి ఉంచుతుందనేగా. కానీ వాస్తవికంగా అలా లేదు. అలా ఉంటే ఎవరికీ అభ్యంతరం? జిహాద్ పేరుతో కేరళలో జరుగుతున్న మత మార్పిడులు, యువతుల అక్రమ రవాణా, వివాహాలు, భూ ఆక్రమణలు, హిందువుల ఊచకోత గురించి ఇందులో అబ్బాస్ రాశారో లేదో తెలియదు. కొద్దిగానే అయినా అబ్బాస్ రాసిన విషయాన్ని నేటి ముస్లిం సంస్థలు ఎంతవరకు ఆమోదిస్తాయో?





