
196views
మానవతా విలువలకు ప్రతీకగా దశావతారా ల్లోని కూర్మావతారం కనిపిస్తుందని డాక్టర్ కోగంటి వేంకట అప్పలాచార్యులు అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాల యంలోని పద్మావతి కల్యాణ వేదికపై ‘కూర్మావతారం- మానవతా విలువలు’ అనే అంశంపై ప్రవచనం జరిగింది. అప్పలాచార్యులు మాట్లాడుతూ కూర్మావతారం విష్ణువు ధరించిన రెండో అవతారమని, ఇది మానవతా విలువలకు ప్రతీక అని వివరించారు. ఓపిక, బలం, త్యాగం వంటి లక్షణాలను సూచిస్తుంద న్నారు. ఈ అవతారం ద్వారా విష్ణువు సంక్షోభసమయంలో ఓర్పు, బలంతో నిలబడడం, ఇత రులకు సహాయం చేయాలనే విలువలను తెలియజేస్తుందని తెలిపారు.





