News

గుంటూరులో వేద పాఠశాల ప్రారంభం

318views

ధర్మబద్ధంగా సంపాదించిన సొమ్ముతో చేసే కార్యాలు మాత్రమే సత్ఫలితాలిస్తాయని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. గుంటూరు జిల్లా పుత్తూరులో క్రేన్ రిలీజియస్ ట్రస్టు ఏర్పాటు చేసిన వేద పాఠశాలను ఆయన ప్రారంభించారు. అక్కడి వసతులను పరిశీలించిన చినజీయర్ స్వామి… వేద విద్యార్థులను ఆశీర్వదించారు. ధర్మప్రచారం కోసం క్రేన్ సంస్థలు చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. హైందవ సమాజాన్ని కాపాడేందుకు భావితరాలకు సంప్రదాయ భారతీయ కళలు, సంస్కృతిని, వేద విద్యను బోధించేందుకు వేద గురుకుల పాఠశాలను నెలకొల్పడం అభినందనీయమని విద్యార్థులకు వేదాలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్ కూడా నేర్పించాలని సూచించారు.వేదాలను ఆధునిక ప్రపంచానికి అందించేందుకు పాఠశాలను ఏర్పాటు చేసి, ఉత్తమ సమాజ స్థాపనకు కృషి చేయటం అభినందనీయమన్నారు. ఇలాంటి పాఠశాలలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

వేద పాఠశాల ప్రాంగణంలో సంస్కృత పుస్తకాలతో ప్రత్యేక లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు…. క్రేన్ రిలీజియస్ ట్రస్టు ఛైర్మన్ గ్రంథి కాంతారావు తెలిపారు.