News

గాంధార విద్యలో రాణిస్తున్న విద్యార్థులు

254views

ఎన్నో ప్రాచీన యుద్ధకళలకు నిలయం భారతదేశం. కళ్లకు గంతలు కట్టుకుని చుట్టూ ఉన్న పరిస్థితులను మనసుతో అంచనా వేస్తూ కత్తిసాము చేయడం, దారి వెంబడి వెళ్లడం ఇవన్నీ ఒకప్పటి విద్యలు. గాంధార విద్యగా పిలిచే ఈ ప్రక్రియకు తిరిగి ప్రాచుర్యం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వ పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కవి వరప్రసాదరావు. వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లెకు చెందిన 20 మంది విద్యార్థులకు నీలిమ అనే శిక్షకురాలితో ఆయన గాంధార విద్యలో ట్రైనింగ్‌ ఇప్పిస్తున్నారు. సుమారు 3 నెలలుగా శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకొని చదవడం, రాయడం, రంగులు గుర్తించడం, చెస్, క్యారమ్స్‌ ఆడటం, చెక్కభజన, కర్రసాము, సైక్లింగ్, బైక్‌ రైడింగ్‌ తదితరాలను సులభంగా చేసేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఈ విద్యతో తమకు ఏకాగ్రత పెరిగి చదువులో కూడా సులువుగా రాణిస్తున్నామని వారు చెబుతున్నారు.