
223views
కూచిపూడి నాట్యకళను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు వేదాంతం రాధేశ్యాం కోరారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం బచ్చుపేట వేంక టేశ్వరస్వామి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో వేదాంతం రాధేశ్యాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భరతముని నాట్య సంప్రదాయానికి మూల పురుషుడన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో నాట్యానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. లలిత కళల్లో ఒకటైన నాట్యంలో మిగిలిన కవిత్వం, సంగీతం, శిల్పం, చిత్రలేఖనం దాగి ఉన్నాయన్నారు. నర్తకికి గురువు రమ్య నట్టువాంగం అందించగా, అరుణ్ గాత్రానికి వయొలిన్పై సిద్ధి వినాయక్, మృదంగంపై వివేక్ సహకరించారు. కార్యక్రమంలో వేంకటేశ్వరభక్త సంఘం నిర్వాహకులు కెఎల్ఎన్ ఆచార్యులు, చలమలశెట్టి నాగమురళి, లక్ష్మీదేవి ఆలయ కార్యనిర్వహణాధికారి గోవాడ కృష్ణారావు పాల్గొన్నారు.





