News

శ్రీశైలంలో ఆర్టీసీ డ్రైవర్ షేక్ నూర్ అహ్మద్ అనవసర రాద్ధాంతం

167views

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ ఆత్మకూరు డిపో బస్సు డ్రైవర్ షేక్ నూర్ అహ్మద్ అనవసర రాద్ధాంతం చేశాడు. అసందర్భంగా మతపరమైన విద్వేషాలు రెచగ్గొట్టే ప్రయత్నం చేశాడు. శ్రీశైలం దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది దేవస్థానం ప్రాంగణం లో పరమత చిహ్నం ధరించరాదని, టోపీ తీసేయమనీ కోరారు. అయితే ఆ డ్రైవర్ అతి దురుసుగా వ్యవహరిస్తూ ”నేను తీయను అనీ ఇలా తీయడం ఏ రూల్ బుక్ లో లేదనీ, మా డిపో మేనేజర్ ఏమన్నా ఆర్డరు ఇస్తే అప్పుడు ఈ ఉద్యోగానికే రాననీ” అంటూ విద్వేషం నింపే మాటలు మాట్లాడాడు. ఈ విషయం స్వయంగా ఆ డ్రైవర్ తీసిన వీడియో ప్రకారమే తెలుస్తోంది.

గత ముప్పై సంవత్సరాల నుంచి ఆ ముస్లిం డ్రైవర్ అదే ప్రాంతంలో పనిచేస్తున్నాడు. శ్రీశైల దేవస్థానం హిందువులకు ఎంత పవిత్ర దేవస్థానమో అందరికీ తెలుసు. అయినా.. పైగా జ్యోతిర్లింగం. శక్తిపీఠం వున్న చోటు కూడా అదే. అలాంటి ప్రదేశానికి ఇతర మత చిహ్నాలు ధరించి రావడం నిషేధం అని ఆయనకు తెలియదా?? . ఇదేమీ ఈ రోజు ప్రత్యేకంగా పెట్టిన నియమం కాదు. శతాబ్దాలుగా ఉన్న సంప్రదాయం. అయినా ఇన్ని రోజులు ఎవరూ అడగలేదు అంటూ చెప్పడం చూస్తుంటే అసలు విషయం అర్థమైపోతుంది.

ఆత్మకూర్ కర్నూలు ప్రాంతంలో 2018 లో తబ్లీగీ జమాత్ కార్యక్రమం జరిగింది. దీనికి చాలా మంది తరలివచ్చారు. ఆ తర్వాత వ్యక్తిగతమైన గొడవలో ఆత్మకూరు పోలీసు స్టేషన్ పై ముస్లింలు దాడి చేశారు.ఇది కాకుండా నిషేధిత SDPI సంస్థ సమావేశాలు కూడా ఇదే ప్రాంతంలో జరిగాయి. వీటన్నింటి ఫలితమే ఇప్పుడు ఇలాంటి విద్వేష కార్యకలాపాలు సాగుతున్నాయని స్థానిక హిందువులు ఆరోపిస్తున్నారు.