
శ్రావణమాసం సందర్భంగా ఉత్తరభారతీయీలు కన్వర్ యాత్రను ఎక్కువగా చేస్తుంటరు. ఈ యాత్రలో భాగంగా భక్తులు హరిద్వార్, గంగోత్రి, రిషికేష్ వంటి ప్రాంతాల నుంచి గంగాజలాన్ని కావడిలో నింపుకుని తమ ప్రాంతాల్లోని శివాలయాలకు కాలినడకన తీసుకెళ్తారు. తాజాగా కన్వర్ యాత్రలో తన భర్తను వీపుమీద మోసుకుంటూ ఆశా అనే మహిళ 150 కిలోమీటర్లు నడిచి కన్వర్ యాత్రను పూర్తి చేసింది. అంత ప్రేమను తమ భర్తమీద చూపిస్తే ఇప్పుడు చెప్పబోయే మహిళ మాత్రం ప్రియుడి మోజులో పడి, కన్వర్ యాత్ర చేసే తన భర్తను ప్రియుడి సహాయంతో సజీవ దహనం చేసింది. ఈ విస్తుపోయే ఘటన ఉత్తరప్రదేశ్ లోని భాగవత్ లో జరిగింది.
కంగరాన్ గ్రామంలో భార్య అంకిత, ప్రియుడు డాక్టర్ అయ్యూబ్, అంకిత మామ సుశీల్, బేబీ అనే వ్యక్తి కలిసి సన్నీ అనే యువకుడిని సజీవంగా దహనం చేశారు. వివరాల్లోకి వెళితే మఈతుడు భార్య అంకిత స్థానికంగా ఉండే డాక్టర్ అయ్యూబ్ తో గత కొంతకాలంగా సంబంధాన్ని కలిగి ఉంది. దాంతో ఆ వ్యక్తితో ఆమె మాట్లాడద్దని సన్నీ చెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు కూడా అయ్యాయి. దాంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక జులై 22న కన్వర్ యాత్రను చేయడానికి సన్నీ తన ఇంటినుండిబయలుదేరాడు. తను డోఘాట్ ప్రాంతంలోని కన్వర్ మార్గంలో చేరుకున్నప్పుడు, అతని అత్తమామలు, అతని భార్య ప్రేమికుడు అయూబ్ అక్కడికి చేరుకుని అతనిని తమతో తీసుకెళ్లారు.
ఆ తర్వాత అయూబ్ , అంకితతో పాటు సన్నీ అత్తమామల ముందే సన్నీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు వెంటనే సన్నీ కుటుంబానికి ఈ సమాచారం అందించారు, వెంటనే కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని సన్నీని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ నుండి అతన్ని ఉన్నత కేంద్రానికి తరలించారు, కానీ అతని పరిస్థితి విషమంగా ఉండటంతో, సన్నీని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల పాటు మఈత్యువుతో పోరాడి సన్నీ చనిపోయాడు.
దాంతో సన్నీ కుటుంబ సభ్యులు సన్నీ మృతదేహంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ధర్నా నిర్వహించారు. పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసకోలేదని, తక్షిణన్యాయం జరగాలంటూ ధర్నాకు దిగారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేకూరుస్తామని ప్రకటించారు. ప్రస్తుతం, పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.





