News

పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ్ లో రథయాత్ర వద్ద నమాజ్ కలకలం

189views

ఇటీవలే తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేయడం పై తీవ్ర కలకలంరేగిన విషయం మనందరికీ తెలిసిందే..తిరుమల కళ్యాణ వేదిక వద్ద మే 24వ తేదీన ఓ వ్యక్తి నమాజ్ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే టీటీడీకి సమాచారం ఇవ్వడంతో టీటీడీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ చూడడంతో పై దఈశ్యాలన్నీ బయటకు వచ్చాయి. అయితే తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ దీన్ని అతిక్రమించడంపై పలువురు ఆగ్రహాన్న వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం సప్త మోక్షపురాల్లో ఒకటైన పూరీ జగన్నాథ మందిరం రథోత్సవంలో ఓ మహిళ నమాజ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పూరీలో జరిగిన రథయాత్ర ఉత్సవంలో, ఒక మహిళ జగన్నాథుడి రథం కింద నమాజ్ చేయడం కనిపించింది, ఇది సామాజిక మత వర్గాలలో విస్తృత చర్చ , వివాదానికి దారితీసింది. దీనిపై కొందరు ఇది శాంతియుత చర్యఅనీ అన్నిమతాలు సమానమేనని వాదిస్తున్నప్పటికీ చాలామంది మాత్రం ఇది మమ్మాటికీ తప్పేనని అంటున్నారు. అత్యంత పవిత్రమైన హిందూ కార్యక్రమంలో ఇలా చేయడం హిందువులను రెచ్చగొట్టడానికి మాత్రమే చేసారని భావిస్తున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంఘటన వల్ల పట్టణం లో ఉద్రిక్తతలు పెరిగడంతో అధికారులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. శాంతిని కాపాడుకోవాలని మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టవద్దని ప్రజలను కోరుతున్నారు. పై రెండు సంఘటనలు మనం బాగా గమనిస్తే కావాలనే ఆ మతం వారు హిందువులను రెచ్చగొట్టడానికి పుణ్యక్షేత్రాల వద్ద ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.