News

యువతి మృతికి కారణమైన SDPI కార్యకర్తల అరెస్ట్

271views

బహిరంగంగా ఓ యువతిని వేధించి, మరణానికి కారణమైన ముగ్గుర్ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. రసీనా అనే యువతిని బహిరంగంగా వేధిస్తూ, మోరల్ పోలీసింగ్ చేస్తున్నట్లు కూడా వీరిని గుర్తించారు. ముబ్షీర్; ఫైసల్, రఫ్నాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. వీరికి నిషేధిత సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్ డీపీఐ)తో, నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తో కూడా సంబంధాలున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా.. ఈ ముగ్గురూ దోషులని తేలింది.

అయితే.. ఈ ఘటన ఈ నెల 15 న అచంకరా మసీదు సమీపంలో జరిగింది. రసీనా తన స్నేహితుడితో ఓ కారులో కూర్చొని వీళ్లకి కనిపించింది. దీంతో ఆ స్నేహితుడ్ని కారులోంచి ఈ ముగ్గురు బయటికి లాగి, దాడి చేసి, మొబైల్‌ను లాక్కొన్నారు. ఈ ఘటన తర్వాతే రసీనా తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. సూసైట్ నోట్‌లో ఈ ముగ్గురి పేర్లను ప్రస్తావించింది.దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.హ