
270views
ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని కెనడాలో జరుగుతోన్న జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు స్పష్టం చేసింది. అదే సమయంలో ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉండరాదని కూడా ఓ ముసాయిదా ప్రకటన ద్వారా తేల్చి చెప్పింది. ప్రాంతీయ సుస్ధిరత కోసం రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ముసాయిదాలో సూచించాయి. మరోవైపు సదస్సులో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధంలో ఇరాన్ గెలవదన్నారు. ఆలస్యం కాకముందే ఇరాన్ సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభిస్తే మేలని సూచించారు. అమెరికా సంస్థలపై దాడి చేస్తే కనీవినీ ఎరుగని రీతిలో ప్రతిదాడులు చేస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు. జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు ముసాయిదా ప్రకటనపై సంతకం చేసేందుకు ట్రంప్ నిరాకరించారని సమాచారం.ఔ కాగా, ప్రధాని మోదీ సైప్రస్ పర్యటన ముగించుకుని జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడా చేరుకున్నారు.





