News

‘సంస్కార భారతి’ నూతన కార్యవర్గం

253views

సంస్కారభారతి మహానగర్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంస్కారభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీ ఎన్ కృష్ణ తెలిపారు. విజయవాడలోని సింగ్ నగర్లోని సంస్థ కార్యాలయంలో దర్భా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియామకాలు జరిగినట్లు పేర్కొ న్నారు. అధ్యక్షుడిగా పసుమర్తి భాస్కర శర్మ, ఉపాధ్యక్షులుగా నందగిరి నరసింహారావు, సీహెచ్ వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శిగా జొన్నలగడ్డ శ్రావణ్ కుమార్, కోశాధికారిగా సాయి శంకర్, రంగస్థలం, చిత్రకళ, దృశ్యకళ, సాహిత్య, వారసత్వ శాఖలకు కేఆర్ఎస్ గణేష్. చింతా డూండీ కృష్ణ, నాగలక్ష్మి, జీఎస్ఓ కుసుమ సాయి, బీ రూపాశ్రీ, తదితర 14 మం దీని ఎంపిక చేసినట్లు తెలిపారు. మూడేళ్ల పాటు సంస్కార భారతి ఆధ్వర్యంలో సాంస్కృ త కళారంగాలకు పెద్దపీట వేస్తూ వారిని కార్యో న్ముఖలను చేస్తారని తెలిపారు.