
246views
కేదార్‌నాథ్ యాత్ర సోమవారం పునఃప్రారంభమైంది. ఆదివారం రుద్రప్రయాగ జిల్లాలోని పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ క్రమంలో కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రకు వెళ్లే మార్గంలో పడిన కొండచరియలను తొలగించడంతో సోమవారం పునరుద్ధరించారు.
ఈ వారం మొత్తం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లే నడక నడక మార్గాన్ని మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.





