News

6న వక్ఫ్‌ పోర్టల్‌ ఉమీద్‌ ప్రారంభం

167views

వక్ఫ్‌ సవరణ చట్టం అమలుపై ముందుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం ఉద్దేశించిన ప్రత్యేక పోర్టల్‌ ‘ఉమీద్‌’ (యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియన్సీ అండ్‌ డెవల్‌పమెంట్‌)ను ఈ నెల 6న ఆవిష్కరించనుంది. వక్ఫ్‌ ఆస్తులు అన్నింటినీ ఆరు నెలల్లోగా ఈ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని సూచించింది. ఆస్తుల కొలతలు, వివరాలు, జియో ట్యాగింగ్‌ లోకేషన్‌ను కూడా జత చేయాల్సి ఉంటుంది. సకాలంలో ఆస్తులను రిజిస్టర్‌ చేయకపోతే వాటిని వివాదాస్పద ఆస్తులుగా పరిగణించి ట్రైబ్యునల్‌ పరిశీలనకు పంపిస్తారు. మహిళల పేరున వక్ఫ్‌ను ఏర్పాటు చేయకూడదని తెలిపింది. మరోవైపు, వక్ఫ్‌ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.