
180views
శ్రీశైల క్షేత్రంలోని ఉభయ దేవాలయాల సంరక్షణకు గాను ఐఐటీ, ఏఎస్ఐఐ, ఆగమశాస్త్ర, పూణేకు చెందిన నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృంద సభ్యులు శ్రీశైలానికి చేరుకుని క్షేత్రంలో ఉన్న ఉభయ దేవాలయాలను బలోపేతం చేసే చర్యలపై సమీక్ష జరిపారు. వచ్చే 200-300 ఏళ్ల పాటు ఉభయ దేవాలయాలు స్థిరంగా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిపుణుల బృందానికి ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మురళీబాలకృష్ణ తదితరులు పలు అంశాలను వివరించారు.





