News

వెలుగులోకి తామ్ర శాసనం

250views

కడప నగరంలోని స్థానిక ప్రముఖులు శారద ప్రసన్న ఆధీనంలోని తామ్ర శాసనాన్ని వెలుగులోకి తెచ్చారు. స్థానిక సీపీ బ్రౌన్‌ బాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి దీని గురించి ఏపీగ్రఫీ విభాగం డైరెక్టర్‌ మునిరత్నంరెడ్డి దృష్టికి తీసుకు రాగా, ఆయన శాసనం వివరాలు వెల్లడించారు. 14వ శతాబ్దానికి చెందిన విజయనగరరాజు హరిహర రాయల కాలం నాటి శాసనమని గుర్తించారు. ఇందులో తెలుగుభాషకు సంబంధించిన అక్షరాలతో రాశారని, శక 1283, విజయ, భాద్రపద, శు 7 = 1361 ఆగస్టు 8, ఆదివారం నాటిదన్న వివరాలు ఇందులో కనిపిస్తున్నాయన్నారు. గుత్తి–రాజ్య చిరనది అనే ప్రదేశంలో గల యెదులపల్లి గ్రామానికి పాకనాటి తిమ్మయ అనే వ్యక్తిని గ్రామ నిర్వాహకుడిగా నియమించినట్లు ఉందన్నారు. దాంతోపాటు రాజు గ్రామంలోని అనేక భూములను బహుమతిగా ఇచ్చారని, ఈ వివరాలు కూడా ఇందులో నమోదు చేశారని, ఇంకా ఇచ్చిన భూముల సరిహద్దులను ప్రస్తావించారన్నారు.