
పల్నాడు జిల్లా మాచర్ల మండలం భైరవునిపాడులో క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన చిన్న వీరభద్రుని శిల్పాన్ని పరిరక్షించుకుని భవిష్యత్ తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అం డ్ అమరావతి (సీసీవీఏ), ప్లీచ్ ఇండియా సంస్థ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కోరారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భైరవునిపాడు గ్రామానికి చెందిన మున్నంగి జగన్నాథం.. పాత శివాలయం సమీ పంలో పాలాల్లో ముళ్లపొదల్లో కూరుకుపోయి తల వరకు మాత్రమే కనపడుతున్న చిన్న వీర భద్రుడి విగ్రహాన్ని పైకి తీసి శివాలయంలో భద్ర పరిచినట్లు తనకు సమాచారం ఇచ్చారని, ఆ విగ్రహాన్ని పరిశీలించానని చెప్పారు. 12 అంగుళాలు ఎత్తు, 6 అంగుళాలు వెడల్పు, 2 అంగుళాల మందంతో విగ్రహం ఉం దని, కుడి చేతిలో కత్తి, బాణం, ఎడమ చేతిలో ధనస్సు, డాలు, తలపై జటామకుటం ధరించి, పీఠంపై నిలబడి ఉన్న చిన్నవీరభద్రుడు శిల్పం విజయనగర శైలిలో తీర్చిదిద్దబడిందని వివరించారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల ఈ విగ్ర హాన్ని గుర్తించి భద్రపరిచిన జగన్నాథంను శివ నాగిరెడ్డి అభినందించారు. శివాలయం ఆవర ణలో పీఠాన్ని నిర్మించి ఈ విగ్రహం చారిత్రక ప్రాధాన్యత తెలియజేసేలా బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని





