
330views
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆగమపండితుల ఆధ్వర్యంలోనే పూజా కార్యక్ర మాలు జరుగుతున్నాయని దేవ దాయశాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి తెలిపారు. నెల్లూ రులో మంగళవారం ఆయన విలే కరులతో మాట్లాడారు. ఆల యాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. ప్రధానమైన ఏడు ఆలయాల్లో అన్న ప్రసాదం వితరణ జరుగుతోందని, త్వరలో మరో 16 దేవాలయాల్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో నిత్య అన్నదాన ప్రసాదం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి రామ నారాయణ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి రోజు వారి ఆహార పట్టికను సిద్ధం చేసినట్లు తెలిపారు దేవాలయాల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమం ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం జరుగుతుందని వీటిలో ఎవరు జోక్యం చేసుకోని విధంగా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.





