News

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని శక్తి పీఠం సరస్వతీ దేవాలయం పరిస్థితి ఇఫ్పుడు ఎలా ఉంది..?

418views

హిందూ పురాణాల్లో అష్టాదశ శక్తి పీఠాలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి శారదా పీఠం కూడా ఒకటి. సరస్వతి దేవి దేవాలయంగా పేరు అందిన ఈ ప్రాచీన దేవాలయం బాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని నీలం నది ఒడ్డున ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన దేవాలయాల్లో ఒకటి. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలోనే ఇక్కడ విశ్వవిద్యాలయంతో పాటు ప్రముఖ గ్రంథాలయం కూడా ఉంది.

భారతీయ భాషలకు మూలమైన బ్రాహ్మీ లిపి ఈ పురాతన పుణ్యక్షేత్రంలోనే పురుడు పోసుకుంది. ఈ పుణ్యక్షేత్రం కాశ్మీరీ పండితులకు అత్యంత పవిత్రమైనది. అష్టాదశ శక్తి పీఠాలలో సతిదేవత కుడి చేయి ఈ ప్రదేశంలో పడింది. చరిత్రకారుల ప్రకారం ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 237 సంవత్సరంలో మౌర్య మహారాజు అశోకుడు నిర్మించాడని పేరుంది.

ఇక్కడ ఆదిశంకరాచార్యుడు సర్వజ్ఞాన పీఠాన్ని అధిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. హిందూ బౌద్ధ ధర్మాలకు రెండిటికి కూడా ఇది ఒక పుణ్యక్షేత్రం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆధీనంలోకి ఈ పుణ్యక్షేత్రం వెళ్లినప్పటి నుంచి భక్తులకు ఈ దేవాలయ సందర్శన అనేది దాదాపు నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది.

కశ్మీరీ పండిట్లు తమకు ఈ ఆలయాన్ని సందర్శించే అవకాశం కల్పించాలని అటు భారత ప్రభుత్వానికి పలుమార్లు సిఫార్సు చేశారు. అయితే వివాదాస్పదమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో ఈ దేవాలయం ఉండటం ద్వారా భక్తులకు ఈ ఆలయ సందర్శన అనేది చాలా కష్టతరంగా మారిపోయింది. పాకిస్తాన్ మద్దతుతో నడిచే అక్కడి ఆజాద్ కాశ్మీర్ ప్రభుత్వం కూడా ఈ దేవాలయం బాగోగులను పట్టించుకోలేదు. దీంతో పూర్తిగా శిథిలావస్థకు చేరింది.

భారత కశ్మీర్ భాగమైన బారాముల్లాకు అత్యంత సమీపంలోనే ఈ దేవాలయం ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ రేఖకు సమీపంలో ఉన్న ఈ సరస్వతి దేవాలయం ఎప్పటికైనా భారత దేశంలో అంతర్భాగమై భక్తులకు దర్శనమివ్వాలని కశ్మీరీ పండితుల చిరకాల వాంఛగా ఉంది.