News

భారత్ దెబ్బకు పాకిస్థాన్ ముక్కలు అవుతుందా..? పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోరుకుంటున్న…

305views

భారత్ పాకిస్తాన్ మధ్య రోజు రోజుకి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాల భారత సైన్యం పాకిస్తాన్ పైన శతఘ్నుల మోత మోగిస్తుందా అని పాక్ గుండెల్లో గుబులు మొదలైంది. అయితే పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం, పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోలేని ఒక గుణపాఠం నేర్పిస్తామని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

ఇందులో భాగంగా సింధు నది జలాల ఒప్పందం నుంచి భారత తప్పుగా ఇప్పుడు పాకిస్తాన్లో నీటి సంక్షోభం ఏర్పడుతోంది, మరోవైపు భారతదేశంతో అన్ని రకాల వాణిజ్య బంధాలను తెంపుకోవడంతో పాటు పాకిస్తాన్ ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ద్వారా పాకిస్థాన్ కు లభించే ఆర్థిక తోడ్పాటును కూడా నిలిపివేయించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇలా ముప్పేట దాడి మొదలవగా, ఇప్పుడు పాకిస్తాన్ గుండెల్లో మరో రాయి పడింది. అదే పాకిస్తాన్ విభజన.

ఇప్పటికే పాకిస్తాన్ ను భారత్ రెండు ముక్కలు చేసింది 1971లో భారత సైన్యం బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి మద్దతుగా నిలిచి తూర్పు పాకిస్తాన్ పై దాడి చేసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్ లో పురుడు పోసుకొని ఉన్న ఏర్పాటు ఉద్యమాలకు భారత్ గనుక మద్దతు ఇచ్చినట్లయితే ఆ దేశం మరిన్ని ముక్కలు కావడం ఖాయం అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ప్రాంతం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని బలంగా పోరాటం చేస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే బలూచ్ ఆర్మీగా పిలువబడే తిరుగుబాటుదారులు, ఒక ట్రైన్ సైతం హైజాక్ చేసి ఆ దేశానికి సవాల్ విసిరారు. బెలూచిస్తాన్ తో పాటు పాకిస్థాన్ లో వేరు దేశాలుగా విడిపోవాలని చూస్తున్న ఇతర రాష్ట్రాలు ఏవో చూద్దాం.

గిల్గిట్ – బాల్టిస్థాన్ ప్రాంతం కూడా సుదీర్ఘకాలంగా వేరు దేశంగా విడిపోవాలని చూస్తోంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దును పంచుకుంటున్న ఖైబర్ ప్రాంతం కూడా వీరు దేశంగా విడిపోవాలని పలుమార్లు తిరుగుబాటు సైతం చేసింది. దీన్ని బట్టి పాకిస్తాన్ భారతదేశంతో ఎక్కువగా గొడవలు పెట్టుకుంటే మాత్రం ముక్కలు అవ్వడం ఖాయమని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు