
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న యూట్యూబర్ మన్సూర్ అలీని తిరుచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కేవలం పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో తప్పుడు వార్తలనే వ్యాప్తి చేయడమే కాకుండా, ఈ దాడితో బీజేపీ కార్యకర్తకు సంబంధాలున్నాయని కూడా వ్యాప్తి చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, అరెస్ట్ చేశారు. అలాగే ఐటీ చట్టం 2008 లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
తిరుచ్చిలోని వల్లువర్ నగర్‌లోని నందర్షా మసీదు సమీపంలోని జిన్నా నగర్‌లో మన్సూర్ అలీ వుంటాడు. జమ్మూ కశ్మీర్ బీజేపీ ఐటీ విభాగంలో పనిచేస్తున్న తాలిబ్ హుస్సేన్ షా అనే వ్యక్తికి ఉగ్రదాడితో సంబంధం వుందంటూ యూట్యూబర్ మన్సూర్ అలీ తెగ ప్రచారం చేశాడు. దీనికి సంబంధించిన తప్పుడు వీడియోలను పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మన్సూర్ అలీపై భారతీయ న్యాయ సంహిత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2008 లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే.. రామ సేతువు, రాముడిపై ఇప్పటికే మన్సూర్ అలీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఆ కేసు ఇంకా పెండింగ్ లోనే వుంది.




