
శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి అధ్వర్యంలో గుంటూరు నగరంలో నిర్వహించిన భారీ శోభాయాత్రతో గుంటూరు నగర వీధులు కళకళలాడాయి. శ్రీరామ జయజయధ్వానాలతో వేలాదిమంది భక్తులు నగర వీధులలో గుండా శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గోన్నారు. భారీ రధాన్ని అందంగా పూలతో అలంకరించి, శ్రీరాములు,సీతా లక్ష్మణులు, హనుమంతుల విగ్రహాలను దానిపై అధిరోహించపచేసి, పురవీధులలో శోబాయాత్రను నిర్వహించారు. ఘజల్ శ్రీనివాస్ గీతాలు, వివిధ పీఠాధిపతుల ప్రవచనాలతో నగరమంతా పులకించింది. కార్యక్రమంలో పాల్గోన్న బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ మాట్లాడుతూ, వికసిత్ భారత్ సాధనకు అవసరమైన శ్రీరాముని దీవెనలు మన దేశంపై పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ ఈ శోభాయత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత్ విశ్వ గురువుగా అవతరించాలంటే రామనామమే శరణ్యమని ప్రజలు నమ్మి ఈ శోభాయత్రలో వేలాదిగా పాల్గోన్నారని ఆయన అన్నారు.
బ




