News

ఒంటిమిట్టలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

347views

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్‌ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజైన ఆదివారం రాత్రి జగదభిరాముడు ప్రత్యేక అలంకారంలో శేష వాహనంపై దర్శనమిచ్చారు. సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరోవైపు శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీరామనవమి ఆస్థానాన్నినిర్వహించారు.ఇందులో భాగంగా శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతుడి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం హనుమంత వాహనంపై శ్రీరాముడు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని నిర్వహించారు.
డెస్క్