News

గిరిజనుల భూములను కాపాడినందుకు కేంద్రానికి ధన్యవాదాలు : వనవాసీ కల్యాణాశ్రమం

382views

వక్ఫ్ సవరణ బిల్లులో గిరిజనుల భూమిని వక్ఫ్ పరిధిలోకి రాకుండా చేసిన కేంద్ర ప్రభుత్వ చర్యను వనవాసీ కల్యాణాశ్రమం స్వాగతించింది. మేరకు వనవాసీ కల్యాణాశ్రమం అధ్యక్షుడు సత్యేంద్ర సింగ్ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది. తాము దేశవ్యాప్తంగా ఇదే విషయంపై వక్ఫ్ జేపీసీకి తమ వైఖరిని తెలియజేస్తూ, మెమోరండం కూడా సమర్పించామని పేర్కొంది. రాజ్యాంగంలోని 5,6 షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ తెగల పరిధిలోకి వచ్చే భూములను కూడా వక్ఫ్ తమ ఆస్తులుగా నమోదు అయ్యాయి.

రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూల్ లోని గిరిజనుల భూములు వక్ఫ్ పరిధికి దూరంగా వుంటాయని మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా ప్రకటించారని పేర్కొంది. ఇదంతా కూడా తమ కృషి ఫలితమేనని వనవాసీ కల్యాణాశ్రమం ప్రకటించింది. ఈ ప్రకటన దేశంలోని వనవాసుల్లో తెగ సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని పేర్కొంది. గిరిజనుల భూములను కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి కల్యాణాశ్రమం ధన్యవాదాలు ప్రకటించింది.