News

గిరిజనుల భాష పరిరక్షణకు ‘శక్తి ప్రేరణ సమ్మాన్‌’ అవార్డు

313views

గిరిజనుల భాష పరిరక్షణకు తన వంతు కృష్టి చేస్తూ, అణగారిపోతున్న 19 గిరిజన భాషలకు లిపిని అందించి, జీవం పోసిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీకి ‘శక్తి ప్రేరణ సమ్మాన్‌’ అవార్డు లభించింది. జాతీయ మహిళా స్వచ్చంద సంస్థ, ఆంధ్ర విభాగం ‘ఆంధ్ర శక్తి’ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వనపల్లి పద్మావతి, సభ్యులు ఈ అవార్డును వీసీకి అందజేశారు. కార్యక్రమంలో ఆచార్య పి.ఉమామహేశ్వరీదేవి, డాక్టర్‌ ఎన్‌.సజనరాజ్‌ పాల్గొన్నారు.