News

ఛావా సినిమాను నిషేధించాలి.. లేఖ రాసిన ముస్లిం మత గురువు

264views

విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పీరియాడికల్ మూవీ ఛావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక మార్చి 07న తెలుగులోనూ ఛావా మూవీ రిలీజ్ కాగా, ఇక్కడ కూడా మంచి వసూళ్లే రాబడుతోంది. ఈ సినిమాలో మరాఠాలకు, మొఘలు పాలకులకు మధ్య ఘర్షణ, యుద్ధాలను ప్రధానంగా చూపించారు. ముఖ్యంగా మరాఠాలు ఎంతో ఆరాధించే ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్‌ని ఔరంగజేబు క్రూరంగా హింసించడాన్ని సినిమాలో చూపించారు.

ఈ సినిమా రిలీజైన తర్వాత మహారాష్ట్రతో పాటు హిందువుల్లోనూ భావోద్వేగాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మరాఠా గడ్డపై ఔరంగజేబు సమాధిని తొలగించాలనే నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ డిమాండ్ తోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ తదితర ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఛావా సినిమాను నిషేధించాలని ముస్లిం మత గురువు మౌలానా షాబుద్దీన్ రజ్వీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఛావా సినిమా అల్లర్లు సృష్టించేలా ఉందని అందుకే ఈ సినిమాను ప్రదర్శించకుండా బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు కారకులైన ఛావా రచయితలు, దర్శకుడు, నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని రజ్వీ లేఖలో డిమాండ్ చేశారు.

చరిత్రలో జరిగిన విషయాన్ని చూపించిన ఒక సినిమా పై ఈ విధంగా విషం కక్కడం దారుణమని విషయం తెలిసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.