
244views
రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని శ్రీకూర్మ క్షేత్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. వారు శ్రీకూర్మనాథుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు వారికి ఆశీర్వచనాలు అందజేసారు. స్వామివారి చిత్రపటాన్ని ఆలయ ఈవో గురునాథరావు, ప్రధానార్చకులు సీతారామ నరసింహాచార్యులు అందజేశారు. అనంతరం కేంద్రమంత్రి, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ క్షేత్రాన్ని అభివృద్ధి చేసి, విదేశీ పర్యాటకులు ఇక్కడకు వచ్చేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.





