
కృష్ణాజిల్లా మచిలీపట్నం దత్తాశ్రమం, బుట్టాయిపేట నందు 08.03.2025న సేవాభారతి ఆధ్వర్యంలోని మచిలీపట్నం క్యాచ్ మెంట్ అభ్యాసిక (ఉచిత ట్యూషన్ సెంటర్)ల విద్యార్థిని, విద్యార్థుల సమ్మేళనం బాలమేళా జరిగినది.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా శ్రీ బొమ్మరాజు సారంగపాణి గారు, ముఖ్య వక్తగా శ్రీ కాళ్ళకూరు చంద్రశేఖర్ గారు, వేదిక అధ్యక్షులుగా శ్రీ పంచకర్ల వాసుదేవరావు గారు, ముఖ్య అతిథిగా శ్రీమతి గుడివాడ కల్యాణి గారు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు తమ స్వయం ప్రేరణతో, నిస్వార్ధంగా సేవాభారతి ఆధ్వర్యంలో విద్య, వైద్య, సామాజిక, స్వావలంబన రంగాలలో కృషి చేస్తున్నారని, అనాధలకు ఆవాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు అనేక రంగాలలో తమ సమయాన్ని ఇచ్చి సేవలు అందిస్తున్నారని అదే స్ఫూర్తితో మరింతమంది యువత, విద్యార్థులు చిన్న వయసు నుంచే సేవా భావాన్ని అలవరచుకుని తన సమాజం కోసం కొంత సమయాన్ని ఇవ్వాలని కోరారు.
బాలమేళా’ కార్యక్రమంలో విద్యార్థులు శాస్త్రీయ, సంప్రదాయ నృత్యాలు, నృత్య రూపకాలతో అలరించారు.విద్యార్థుల ప్రదర్శనలు తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. తదుపరి విద్యార్థులకు బహుమతులు అందించి, అధ్యాపకులకు నూతన వస్త్రాలు అందించి గౌరవించడం జరిగినది.





