
255views
విశాఖపట్నం జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని అప్పన్న స్వామి పెళ్లి చూపులు ఉత్సవం, డోలోత్సవం సంప్రదాయ బద్దంగా జరిగాయి. అర్చకులు స్వామి, అమ్మవార్లను సింహగిరి పైనుంచి మెట్ల మార్గంలో కొండ దిగువకు తీసుకొచ్చారు. పుష్కరిణి ఉద్యాన మండపంలో దేవతామూర్తులను ఉయ్యాలలో అధిష్ఠించి చూర్ణోత్సవం, వసంతోత్సవం, ఉయ్యాల సేవలు నిర్వహించారు. అప్పన్న స్వామి సోదరి, పైడితల్లి అమ్మవారి కుమార్తెతో స్వామికి పెళ్లి కుదిరిన సందర్భంగా అర్చకులు, గ్రామస్థులు ఆనందోత్సాహాల నడుమ రంగులు చల్లుకొని వేడుకలు నిర్వహించారు. డోలోత్సవం అనంతరం స్వామి అమ్మవార్ల గ్రామ తిరువీధి మహోత్సవం కనుల పండువగా సాగింది. ఏప్రిల్ 8న సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక తిరు కల్యాణోత్సవం, రథోత్సవం వైభవంగా జరగనున్నాయి.





