
అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్రస్వామి పారువేట ఉత్సవం సందర్భంగా హిందూ భక్తులపై జరిగిన దాడిని బీజేపీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రస్తావించారు.వీరభద్ర స్వామి దేవాలయానికి 1300 సంవత్సరాల చరిత్ర వుందని, తరతరాలుగా అక్కడ ఉత్సవం, శోభాయాత్ర జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా హిందువులపై పెట్టిన దాడులను ఆయన ఖండించారు. ఇలాంటి సంఘటనలతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఇలాంటి అల్లరి మూకలను ఎవరు ప్రోత్సహిస్తున్నారో కనుక్కొని, వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ దేశం కోసం, ధర్మం కోసం జాతీయవాద సంస్థలు నిరంతరం పనిచేస్తూనే వుంటాయని, వీరిని చులకనగా చూడటం సరైందని కాదని అన్నారు.
‘‘అధ్యక్షా అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి పేర్వాట ఉత్సవం మార్చి 4వ తారీఖున జరిగింది అధ్యక్ష ఇందులో జరిగిన ఒక సంఘటన గురించి సభకు తెలియజేయడానికి నేను ఉన్నాను అధ్యక్ష 1300 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అధ్యక్ష తరతరాలుగా వస్తున్నటువంటి ఉత్సవం భజన సంకీర్తనంతో ఆనందోత్సాహాల మధ్య శోభా యాత్ర జరుగుతుంది మార్చి 4వ తారీఖున అక్కడ తానా జంక్షన్ కి వచ్చారు అధ్యక్ష రాయచోటులో అక్కడ మసీదులో నుంచి వచ్చినటువంటి అల్లరి మూకులు దాడి చేశారు శోభాయాత్ర మీద లాటి చార్జ్ చేసి పోలీసులు చెదరగొట్టారు ఊరేగింపులో ఉన్న భక్తుల మీద కేసులు పెట్టారు పోలీసులు అల్లరి మూకల మీద అయితే గొడవ చేశారని కేసు పెట్టారు హిందూ భక్తుల మీద మాత్రం హత్యాయత్నం చేశారనే కేసు పెట్టడం జరిగింది అధ్యక్ష అక్కడ ఎస్ఐ నరసింహా రెడ్డి అనే వ్యక్తి ఎస్ పి గారికి ఒక కంప్లైంట్ రాస్తాడు అధ్యక్ష ఆ కంప్లైంట్ లో ఆయన చెప్పేది ఏంటిరా అంటే ఊరేగింపులో ఉన్నటువంటి హిందూ భక్తులు జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారు అని చెప్తాడు అయ్యా రాష్ట్రంలో జై శ్రీరామ్ అనే నినాదం చేయడానికి పోలీసు అనుమతి కావాలా అని నేను హోమ్ మంత్రిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అంతే అంతే కాదు అధ్యక్ష ఆయన చెప్తాడు.. ఏవండీ ఇక్కడ నేను పోలీస్ అధికారుల చుట్టూ ఆర్ఎస్ఎస్ వి హెచ్ పి వంటి సంస్థలకు చెందిన కుర్రవాళ్ళు వినకుండా రెచ్చగొట్టారు అని చెప్తాడు అంతేకాకుండా నేను ఆయనకు ఒకటే అడుగుతా ఉన్నాను ఇక ఆయనకు ఆర్ఎస్ఎస్ అన్నా సరే వి హెచ్ పి అంటే అర్థం తెలుసా అని అడుగుతా ఉన్నా.
ఆర్ఎస్ఎస్ అంటే దేశం పట్ల గాని జాతి పట్ల గాని ధర్మం పట్ల గాని ప్రజల పట్ల గాని నిరంతరం పనిచేసే దేశభక్త జాతీయవాద సంస్థలు అధ్యక్ష వీటిని చులకన చేసి కంప్లైంట్లో పెట్టడం చులకనగా ఈ ఎఫ్ ఐఆర్ లో చేర్చడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అధ్యక్ష దేశ సరిహద్దుల్లో సైనికుడు ఎలాగ ఉంటాడో దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఆర్ఎస్ అనుబంధ సంస్థల కార్యకర్తలు అలా ఉంటారని గర్వంగా భావించే కార్యకర్తలం అధ్యక్ష మేమంతా వీళ్ళని ఇంత చులకనగా చూడడం సరైన విషయం కాదు అని చెప్తా ఉన్నాను అధ్యక్ష స్పష్టంగా చెప్తున్నాడు అల్లరి మూకల నుంచి భక్తులను కాపాడలేని పోలీసులు తమ తప్పులు కప్పి పుచ్చుకోవడానికి ఇలా ఎవరిని బుజ్జగించడానికి కఠినమైన సెక్షన్లు పెట్టి హిందువుల మీద పోలీస్ కేసులు పెడుతున్నారు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇది ఇటువంటి సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందండి అధ్యక్ష ఎటు ఎవరు ఇటువంటి అల్లరి మూకలను ప్రోత్సహిస్తున్నారు ఎవరి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయని కనుక్కొని వీటిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇటువంటి సంఘటనల మీద ప్రభుత్వం తక్షణమే కఠినంగా వ్యవహరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం’’ అంటూ ఎమ్మెల్యే ముగించారు.





