( ఫిబ్రవరి 27 – గోద్రా ఘటన )
27 ఫిబ్రవరి 2002… ఏ హిందువూ మరచిపోలేని భయంకరమైన రోజు ఇది. ఇస్లామిక్ జిహాదీ ముష్కరులు గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్6 బోగీకి నిప్పంటించి 59మంది ప్రాణాలు తీసిన రోజు. ఆ సంఘటనే గోద్రా నరమేధంగా, గోద్రా రైలు దహనకాండగా చరిత్రలో చెరగని మచ్చగా నిలిచిపోయింది. దేశం నలుమూలల నుంచి అయోధ్య చేరిన కరసేవకులు “పూర్ణాహుతి మహాయజ్ఞం” అనే కార్యక్రమాన్ని ముగించుకొని 1700 మంది అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు గ్రోదా స్టేషన్ దాటగానే ఉన్నపళంగా ఆగిపోయింది. అప్పుడు సమయం ఉదయం 7 గంటల 43 నిమిషాలు. అలా ఆగిన రైలు పై దాదాపు 1540 మంది ముస్లింలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు హిందువులు గాయపడ్డారు. అయితే అంతటితో ఆగకుండా పెట్రోలుతో రైలు పై విరుచుకుపడ్డారు. ఇందుకు S6 కోచ్ వేదిక అయింది. అంతే 27 మంది మహిళలు 10 మంది పసిపిల్లలతో సహా 59 మంది సజీవదహనం అయ్యారు. 48 మంది అత్యంత క్రూరంగా, కోలుకోలేని విధంగా గాయపడ్డారు.
గోద్రా రైలు దహనం కేసును విచారించిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2011లో తన తీర్పును వెలువరించింది. ఎస్ -6 కోచ్‌లో మంటలు ప్రమాదవశాత్తు లేదా ‘లోపల నుండి’ వచ్చినవి కావని తేల్చి చెప్పింది. రైల్వే స్టేషన్ శివార్లలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ను ఆపిన “నిమిషాల్లోనే” పెట్రోలు నిల్వలతో స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో గుమిగూడారని కోర్టు పేర్కొంది. అమన్ గెస్ట్ హౌస్‌లో సమావేశం తర్వాత నేరస్థులు అంతకు ముందు రాత్రి పెట్రోల్ నిల్వలను సేకరించారని ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు అంగీకరించింది. ఈ దాడి ఎస్ -6పై యాదృచ్ఛిక దాడి కాదని, అయోధ్య నుండి తిరిగి వస్తున్న కరసేవకులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కోర్టు పేర్కొంది. దాడి చేసినవారు నినాదాలు చేయడం, సమీపంలోని మసీదు నుండి లౌడ్ స్పీకర్ ద్వారా ప్రకటన చేయడం కూడా ఉద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళికను స్పష్టంగా సూచిస్తున్నాయని పేర్కొంది.
సంవత్సరాల పాటు జరిగిన అనేక విచారణలు, కమిటీలు, కోర్టుల తీర్పుల అనంతరం 107 మందిపై అభియోగాలు మోపి అరెస్టు చేసి 31 మందిని దోషులుగా తేల్చి 63 మందిని నిర్దోషులుగా తేల్చి 11 మందికి మరణశిక్ష వేసి ఆ తర్వాత దాన్ని కూడా జీవితఖైదుగా మార్చి 31 మందిని జీవితఖైదు చేశాయి న్యాయస్థానాలు. గోద్రా ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన నానావతి కమిషన్ 1500 పేజీల నివేదికను సమర్పించింది. ఈ రిపోర్టులో పక్కా ప్రణాళిక ప్రకారం కరసేవకులను లక్ష్యంగా చేసుకొని రైలుబోగీకి నిప్పు పెట్టారని పొందుపరచడం అయింది. ఏదిఏమైనా గోద్రా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 59 మందికి సంతాపం వ్యక్తం చేస్తూ హిందువులపై జరిగిన ఆ కీచక పర్వాన్ని గుర్తు చేసుకొని బాధను దిగమింగుతూ హిందువులపై వారి సొంతగడ్డపై జరుగుతున్న దాడులను పసిగట్టి మేల్కోవాలి..




