
236views
కుంభమేళా సందర్భంగా ఛత్తీస్‌గఢ్ జైళ్లలో ఉన్న దాదాపు 18,500 మంది ఖైదీలు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమం నుంచి తెప్పించిన నదీజలాలతో పుణ్యస్నానాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జైళ్లలో ఏర్పాటుచేసిన ప్రత్యేక నీటితొట్లలో నదీజలాలను కలిపి ఖైదీలు స్నానాలు చేసినట్లు జైళ్లశాఖ డీఐజీ ఎస్.ఎస్.తిగ్గా తెలిపారు. మానసిక ప్రశాంతత, స్వీయ పరివర్తనలతో ఖైదీలు సానుకూల ఆలోచనలు పెంచుకొని జనజీవన స్రవంతిలో కలవాలనే ఉద్దేశంతో ఈ స్నానాలు ఏర్పాటుచేసినట్లు అధికారులు వెల్లడించారు.




