
369views
‘గిరిజన అట్లాస్’ను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ప్రతి గిరిజన గ్రామంలో వారి జనాభా, సంస్కృతి, ఎంత భూమి సాగు చేస్తున్నారు, అటవీ ఉత్పత్తుల సేకరణకు ఎంతదూరం వెళుతున్నారు తదితర వివరాలను ఈ అట్లాస్ లో పొందుపరచాలని సూచించింది. భూమి హక్కు కోసం చేసుకున్న దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ సూచన చేసింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 1 నాటికి దరఖాస్తుదారుల్లో 48.95 శాతం మందికి భూ హక్కు కల్పించారు. 36.43 దరఖాస్తులను తిరస్కరించగా.. 14.62 అపరిష్కృతంగా ఉన్నాయి. ఒడిసా 2018లోనే ఈ అట్లాస్ ను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు గిరిజన అట్లాస్ తయారుచేయాల్సి ఉంది.




