News

“విద్యార్థులకు నిజమైన చరిత్ర చెప్పాలి’

326views

విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబ విలువలను పెంపొందించాలని కడప చిన్మయామిషన్ అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ తురీయానంద సరస్వతి అన్నారు. వారు ఫిబ్రవరి 13న
అనంతపురం తాడిపత్రి పట్టణంలోని నందలపాడులో శ్రీ సరస్వతీ శిశుమందిరం నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ మనదైన నిజమైన చరిత్రను విద్యార్థులకు బోధించాలని అన్నారు. ప్రధానవక్త ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యవాహ ఏ.వేణుగోపాల్ నాయుడు ప్రసంగిస్తూ సమాజంలోని ఇతర పాఠశాలలకు, సరస్వతీ శిశుమందిరాలకు విద్యావిధానములో ఉన్న తేడాలను తెలియజేస్తూ ఉపాధ్యాయు లతో పాటు తల్లిదండ్రులకు కూడా ఇక్కడ ప్రశిక్షణ జరుగుతుందని తెలిపారు. విభాగ్ కార్యకారిణి సభ్యులు కత్తి రామచంద్రారెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ సంఘటన కార్యదర్శి కన్నా భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం అనంతపురం ప్రాంత కార్యదర్శి పరుచూరి రమేష్, అనంతపురం విభాగ్ కార్యవాహ ఆర్. జగదీష్ ప్రసాద్, అనంతపురం విభాగ్ ప్రచారక్ లక్ష్మణ్, విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు, విద్యాభిమానులు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు