
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు వెన్నుదన్ను లభించింది. హమాస్ ఉగ్రవాదులను బలపరుస్తూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు హమాస్ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించాయి.ఇన్నాళ్లూ కేవలం పశ్చిమాసియాకే పరిమితమైన హమాస్.. ఇప్పుడు విస్తరణపై దృష్టి పెట్టిందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. పీఓకే లో హమాస్ ను బలపరుస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదులు తీసిన బైక్ ర్యాలీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో భారత్ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.టెహ్రాన్ లో పనిచేసిన హమాస్ ప్రతినిధి ఖలేద్ ఖద్దౌమీ ఈ యేడాది ప్రారంభంలో పాక్ పార్లమెంట్ కి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
ఫిబ్రవరి 5వ తేదీని కశ్మీర్ సంఘీభావ దినంగా పాకిస్థాన్ పాటిస్తుంది. ఈ సందర్భంగా రావల్‌కోట్‌లోని షాహిద్ సబీర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో జైషే మహమ్మద్(జేఈఎం), లష్కరే తాయిబా(ఎల్‌ఈటీ) ప్రధాన కమాండర్లతోపాటు హమాస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇరాన్‌లో హమాస్ ప్రతినిధి డాక్టర్ ఖలీద్ అల్ ఖుదామీ.. ఈ సమావేశంలో హమా్‌సకు ప్రాతినిధ్యం వహించారు. హమాస్ తో సంబంధం ఉన్న మరికొందరు పాలస్తీనా నేతలు కూడా ఖలీద్ వెంట ఉన్నారు. ఇక, జైషే చీఫ్ మసూద్ అజర్ సోదరుడు తల్హా సైఫ్, జైషే కమాండర్లు అస్గర్ ఖాన్ కశ్మీరీ, మసూద్ ఇలియా్‌సతోపాటు లష్కర్ కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.





