
ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 2 ఆదివారం నాడు ఒక పెళ్ళి ఊరేగింపు మీద దాడి జరిగింది. కొందరు ముస్లిం యువకులు మూకదాడి చేసి రాళ్ళు రువ్వారు, ఆ ఊరేగింపులో ఉన్న మహిళల ఆభరణాలను దోచుకున్నారు. ఆ దాడికి పాల్పడిన నిందితులు అబ్దుల్, తాహిర్, హస్నయిన్, జునెయిద్, సాజిద్, ఉస్మాన్, ఎహసాన్‌లను పోలీసులు అరెస్ట్ చేసారు.
మహావీర్ అనే వ్యక్తి కుమారుడు హర్ష అనే దళిత హిందూ యువకుడి పెళ్ళి ఊరేగింపు లోనీ ప్రదేశంలోని కంచన్ పార్క్ కాలనీ నుంచి మొదలైంది. పెళ్ళికూతురి కుటుంబం ఉంటున్న ప్రశాంత్ విహార్ కాలనీకి చేరుకుంది. అక్కడి కొందరు ముస్లిం యువకులు ఉన్నట్టుండి ఊరేగింపు మీద దాడి చేసారు. మహిళల ఆభరణాలు దోచుకున్నారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వరుడి కుటుంబ సభ్యులు, ఇతర అతిథులు అందరూ డీజే మ్యూజిక్‌కు నాట్యం చేస్తున్నారు. ఆ ఊరేగింపులోకి ముస్లిం మూక ఒకటి చొచ్చుకెళ్ళి, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. దాన్ని కొందరు పెళ్ళివారు అడ్డుకున్నారు.
‘బారాతీ’లు తమను నిలువరించడానికి ప్రయత్నించడంతో ముస్లిం మూక మరింత రెచ్చిపోయింది. పెద్దసంఖ్యలో ముస్లిములు పోగై, ఊరేగింపు మీద రాళ్ళు రువ్వారు. పెళ్ళి చూడడానికి వెళ్ళిన మహిళల మంగళసూత్రాలు, ఇతర ఆభరణాలు, నగదు దోచుకున్నారు. ఆ దాడిలో కనీసం నలుగురు గాయపడ్డారు, వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పుడు వారి పరిస్థితి నిలకడగానే ఉంది. హింసాకాండ తర్వాత బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.





