
దేవాదాయ శాఖ ఉన్నది హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి అని నిర్ములించడానికి కాదని బిజెపి ఒబిసి మోర్చా పేర్కొంది. కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలం కాల్వబుగ్గలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీ బుగ్గ రామేశ్వర దేవాలయం, బేతంచర్ల మండలం రంగపురం శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దగ్గర ప్రతి శనివారం పూజ చేసుకొని పవిత్రమైన దేవస్థానం, కాల్వబుగ్గ చుట్టూ మాంసాహారంతో “మారు నైవైద్యం” తినడం వలన అపవిత్రం చేస్తున్నారు. వారికి వేరే ప్రదేశం చూపకుండా ఆలయ సిబ్బంది అధికారులు చోద్యం చూస్తున్నారని దీని పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ రఘురాం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఒబిసి మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తెలిపారు.
వినతి పత్రంలో అంశాలు
ప్రతి సంవత్సరం ఆలయ భూములకు సంబంధించిన విషయాలను కూడా నోటీసు బోర్డులో తెలపరచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి బిజెపి మాజీ నగర అధ్యక్షులు మదనమోహన్ ఆచారి శేఖర్ మధు గౌడ్ జగదీష్ ఆచారి రాఘవేంద్ర మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు





