
277views
శంలో 15 కోట్లకు పైగా జనాభా కలిగిన బంజారాల ఆరాధ్య దైవం, గురువు, సంఘ సంస్కర్త సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కై లాస్‌నాయక్ కోరారు. కర్నూలులోని స్థానిక బిర్లా కాంపౌండ్‌లోని ఎల్‌హెచ్‌పీఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో ఉన్న బంజారా ప్రజల కోసం ఈ నెల 13, 14, 15 తేదీల్లో ప్రతి మండల కేంద్రంలో మహారాజ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలన్నారు. అలాగే జయంతి రోజును రాష్ట్ర పండుగగా గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలన్నారు. గోర్ సంస్కృతి నిర్వహణ కమిటీ సభ్యుడు రంగస్వామినాయక్, సీమ కృష్ణ రాథోడ్, నేనావత్ రామునాయక్, రామాంజనేయ చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.





