News

పాకిస్తాన్ కాల‌నీ కాదు.. ఇక‌పై భ‌గీర‌థ కాల‌నీ

304views

విజ‌య‌వాడ అర్బ‌న్ 62వ డివిజ‌న్ ప‌రిధిలో ప్ర‌స్తుతం పాకిస్తాన్ కాల‌నీగా పిలుస్తున్న ప్రాంతాన్ని చ‌ట్ట ప్ర‌కారం భ‌గీర‌థ కాల‌నీగా నామ‌క‌ర‌ణం చేయ‌డం జ‌రిగింద‌ని, ఈ ప్రాంత నివాసితుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 60 మంది ఆధార్ చిరునామాను మార్చ‌డం జ‌రిగింద‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.గ‌తంలో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులతో పాటు రాష్ట్ర స‌గ‌ర్ రాజ‌పుత్ (క్ష‌త్రియ‌వ‌ర్ణ స‌గ‌ర‌) సేవా స‌మితి స‌భ్యులు, స్థానికులు స‌మ‌ర్పించిన విజ్ఞ‌ప్తి లేఖ‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఏపీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 418 ప్ర‌కారం భ‌గీర‌థ కాల‌నీగా నామ‌క‌రణం చేసే అంశాన్ని కౌన్సిల్ ముందుంచ‌డం జ‌రిగింద‌న్నారు. స‌ద‌రు కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించి ఉత్త‌ర్వులు జారీచేసిన మీద‌ట ఈ ప్రాంత నివాసితుల‌కు సంబంధించిన ఆధార్ కార్డుల్లో చిరునామాను మార్చేందుకు మూడు ప్ర‌త్యేక ఆధార్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి మున్సిప‌ల్, గ్రామ వార్డు స‌చివాల‌య విభాగం, రెవెన్యూ, ఆధార్ అధికారులు స‌మ‌న్వ‌యంతో చిరునామాల‌ను మార్పు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. దాదాపు 270 మందికిగాను పాకిస్తాన్ కాల‌నీగా ఉన్న 80 మందిలో ఇప్ప‌టికే 60 మంది చిరునామాను మార్చిన‌ట్లు వివ‌రించారు. ఇంకా ఎవ‌రైనా ఉంటే ఆధార్ కేంద్రాన్ని సంద‌ర్శించి, చిరునామాను మార్చుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఇప్ప‌టినుంచి సంబంధిత ప్రాంతాన్ని భ‌గీర‌థ కాల‌నీగా అధికారికంగా పిల‌వ‌బ‌డుతుంద‌ని ల‌క్ష్మీశ ఆ ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించారు.