News

దుర్గమ్మపై సమగ్ర రచనలకు ప్రోత్సాహం

380views

జగన్మాత దుర్గమ్మపై సమగ్ర రచన లకు ప్రోత్సాహం అందిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి ఈవో రామచంద్ర మోహన్ తెలిపారు. కనకదుర్గమ్మ పై ప్రముఖ పాత్రికేయుడు శంకర నారాయణ రచించిన పాటల సీడీని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న ఈవో కార్యాలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో శంకర నారాయణ రచించిన కనకదుర్గ శతకం భక్తులను ఆకట్టుకుందని చెప్పారు. అమ్మవారి చరిత్రను విశ్లేషించే రచనలు రావాల్సిన అవసరం ఉన్నదన్నారు.ఈ సందర్భంగా గీతాలు స్వరపరచిన రాయారావు విశ్వేశ్వర్, సంగీతం అందించిన దొర్బల లిఖిత్, రాయారావు శివానీలను దేవస్థానం అధికారులు అభినందించారు. స్థానాచార్య శివప్రసాద శర్మ తదితరులు పాల్గొన్నారు.