
న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్‌తో సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈసారి రిపబ్లిక్ వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము, ఇండోనేషియా ప్రెసిడెంట్ సుబియాంటో ఇరువురూ ‘సాంప్రదాయ బగ్గీ’లో రావడం విశేషం. ఈ పద్ధని 40 సంవత్సరాల తర్వాత 2024లో తిరిగి అనుసరించారు. వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
కర్తవ్య పథంలో జరిగిన కవాతును దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత వాయిద్యాలతో కూడిన 300 మంది సాంస్కృతిక కళాకారుల బృందం ‘సారే జహాన్ సే అచ్ఛా’ వాయించారు. ఇక నేటి రిపబ్లిక్ వేడుకల్లో బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్ రాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు దాదాపు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన 31 శకటాలను ఇందులో ప్రదర్శించారు. వేడుకల్లో మొట్టమొదటిసారిగా, ట్రై-సర్వీసెస్ టేబుల్‌లో సాయుధ బలగాల మధ్య ఉమ్మడి, ఏకీకరణ స్ఫూర్తిని చూపేలా ‘శశక్త్ ఔర్ సురక్షిత్ భారత్’ థీమ్‌తో త్రివిథ దళాల మధ్య నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్‌ను సులభతరం చేసే జాయింట్ ఆపరేషన్స్ రూమ్‌ను ప్రదర్శించనున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 29న విజయ్ చౌక్‌లో జరిగే ‘ బీటింగ్ రిట్రీట్ సెర్మనీ’తో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగుస్తాయి. ఈ ఏడాది కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించనున్నారు.





