News

ఎంఎఫ్ హుస్సేన్ గీసిన వినాయకుడు, హనుమంతుడి చిత్రాలు సీజ్ చేయాలని ఆదేశించిన కోర్ట్

283views

దేశంలోని ప్రముఖ చిత్రకారుల్లో ఒకరైన ఎంఎఫ్ హుస్సేన్ వేసిన రెండు చిత్రాలు’అభ్యతరకరం’గా ఉన్నాయని పేర్కొంటూ వాటిని స్వాధీనం చేసుకోవాలని ఢిఆదేశించింది.

హిందూ దేవుళ్లు ఉన్న ఈ చిత్రాలు హిందువుల మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఫిర్యాదుపై విచారించిన న్యాయస్థానం, వాటిని సీజ్ చేయాల్సిందిగా ఆదేశించింది.

2011లో 95 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఎంఎఫ్ హుస్సేన్ అంహుస్సేన్: ది టైమ్‌లెస్ మోడర్నిస్ట్’ అనే ఎగ్జిబిషన్‌లో భాగంగా అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 14 వరకు దిల్లీ ఆర్ట్ గ్యాలరీలో 100కి పైగా చిత్రాలను ప్రదర్శించారు.

అమిత సచ్‌దేవా అనే న్యాయవాది అందులో రెండు చిత్రాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 4న గ్యాలరీలో ఈ “అభ్యంతరకర పెయింటింగ్స్” చూసి, ఫోటోలు తీసినట్లు ఆమె ‘ఎక్స్‌’లో తెలిపారు. హుస్సేన్‌పై గతంలో ఏమైనా ఫిర్యాదులున్నాయా? అని పరిశీలించిన అమిత, డిసెంబర్ 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డిసెంబరు 10న ఆమె విచారణ అధికారితో కలిసి గ్యాలరీకి వెళ్లారు, కానీ అక్కడ సదరు చిత్రాలను అప్పటికే తొలగించారు.

అంతేకాదు, ఆ పెయింటింగ్స్‌ను ఎప్పుడూ ప్రదర్శించలేదని గ్యాలరీ సిబ్బంది వాదించినట్లు ఆమె ఆరోపించారు.

అయితే, అమిత తాను తీసిన పెయింటింగ్స్ ఫొటోలు ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. హిందూ దేవుళ్లయిన వినాయకుడు, హనుమంతుడి పక్కన నగ్నంగా అమ్మాయిలున్నట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది.

రిపోర్ట్ దాఖలు చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని కూడా ఆమె ఆరోపించారు.

మీడియా కథనాల ప్రకారం.. పెయింటింగ్స్ ప్రదర్శనలో ఉన్నాయని నిరూపించడానికి గ్యాలరీ నుంచి సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకోవాలని అమిత సచ్‌దేవా కోర్టును కోరారు.

సోమవారం దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులోని న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఫుటేజీని పరిశీలించి పోలీసులు రిపోర్టును సమర్పించారని చెప్పారు. ఎగ్జిబిషన్ ఒక ప్రైవేట్ స్థలంలో నిర్వహించారని, చిత్రకారుడి అసలు పెయింటింగ్స్ ప్రదర్శించడానికే దానిని నిర్వహించారని విచారణ రిపోర్టులో ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.తకుముందు కూడా హిందూ దేవుళ్లను నగ్నంగా చిత్రించి విమర్శలు ఎదుర్కొన్నారు.

తాజాగా ఈ రెండు చిత్రాలు ప్రదర్శించిన ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీ (డీఏజీ) స్పందిస్తూ తాము ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయస్థానం సరైన తీర్పు ఇస్తుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది.