
167views
ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా జనవరి 27 న తోలెళ్ళ ఉత్సవం, 28 న సిరిమాను సంబరం, 29 న అనుపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఈ జాతరకు ఉత్తరాంధ్ర నుండే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.





